Guru Purnimaగురు పౌర్ణమి
Overview
Guru Purnima celebrates the divine bond between seeker and guide, offering love and gratitude to those who illuminate our spiritual journeys. Just as the Purnima (full moon) brings pure, unbroken light to the night sky, a Guru (Gu = darkness, Ru = remover) dispels the shadows of ignorance and fills life with the light of truth and grace.గురు పౌర్ణమి సాధకునికి, మార్గదర్శకునికి నడుమ వెలిగే దివ్య బంధానికి ప్రతీక. మన ఆత్మప్రయాణాన్ని వెలిగించే గురుదేవులకు ప్రేమపూర్వక ప్రణామాలర్పించే పవిత్ర పర్వదినం. పౌర్ణమి రేయి నింగిని స్వచ్ఛమైన వెన్నెలతో నింపినట్లే... గురువు (గు = చీకటి, రు = నివారకుడు) అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలి, మన జీవితాలను సత్యం, కృప మరియు జ్ఞానకాంతితో ప్రకాశింపజేస్తారు.
"Guru Purnima is the only festival Baba explicitly asked to celebrate. That is why all Baba devotees celebrate this festival with immense love and deep devotion. Just as the moonlight showers so pleasantly and purely on that full moon night... they pray that Baba's love, affection, and blessings shower upon them like that very moonlight, and that Baba's divine grace remains with them forever.""బాబా జరుపుకోమని చెప్పిన ఏకైక పండుగ ఈ గురు పౌర్ణమి. అందుకే బాబా భక్తులందరూ ఈ పండుగను ఎంతో ప్రేమగా, భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఆ పౌర్ణమి నాడు వెన్నెల ఎంత హాయిగా, స్వచ్ఛంగా కురుస్తుందో... బాబా యొక్క ప్రేమ, అనురాగం మరియు ఆశీస్సులు కూడా తమపై అదే విధంగా వెన్నెలలా కురవాలని, బాబా దివ్య అనుగ్రహం ఎల్లప్పుడూ తమపై ఉండాలని ఆకాంక్షిస్తారు."
July 10, 2025
Recurringవార్షికం
Chelluru Datta Sai Mandir – Guru Purnima Celebrations We grandly celebrate the auspicious festival of Guru Purnima every year at Chelluru Datta Sai Mandir, an abode of Baba’s presence and peace. On that sacred day, early in the morning, Kakad Aarti is offered to Baba, followed by a holy bath with fragrant sandalwood paste. Baba is then beautifully adorned with ornaments of love and flowers. During the sacred bath, all devotees are permitted to personally perform Mangala Snanam to Baba’s idol with their own hands. At dawn, devotees begin reading the Baba Satcharitra one after the other until completion. From 10:00 AM onwards, the distribution of sacred Anna Prasadam begins for all visiting devotees and for people in need. From 3:00 PM, a soul-stirring one-hour session of Baba's Divine Namasmarana (chanting of His holy name) takes place. Following the chanting, all devotees come together with utmost devotion and joy to carry out Baba's grand Pallaki Utsavam (Palanquin Procession).చెల్లూరు దత్తసాయి మందిరం – గురు పౌర్ణమి మహోత్సవం ప్రశాంతతకు, భక్తి పారవశ్యానికి నిలయమైన చెల్లూరు దత్తసాయి మందిరంలో ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి పర్వదినాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తాము. ఆ పవిత్రమైన రోజున తెల్లవారుజామునే బాబాకు కాకడ హారతి సమర్పించి, సుగంధ గంధంతో మంగళ స్నానం చేయించిన అనంతరం బాబావారిని ప్రేమాభరణాలతో, పుష్పాలతో నయనమనోహరంగా అలంకరిస్తారు. బాబాకు మంగళ స్నానం చేయించేటప్పుడు భక్తులందరూ ఉత్సవ విగ్రహానికి తమ చేతులతో స్వయంగా మంగళ స్నానం చేయించవచ్చు. అదే వేకువ జాము నుండి భక్తులందరూ ఒకరి తర్వాత ఒకరు ఆధ్యాత్మిక నిష్ఠతో బాబా సచ్చరిత్ర పారాయణను ప్రారంభించి, అఖండంగా ఆ రోజంతా పూర్తి చేస్తారు. ఉదయం 10:00 గంటల నుండి మందిరానికి విచ్చేసే భక్తులందరికీ పవిత్రమైన అన్నప్రసాద వితరణ ప్రారంభమవుతుంది. అనంతరం మధ్యాహ్నం 3:00 గంటల నుండి ఒక గంట పాటు మంత్రముగ్ధమరిచేలా బాబా దివ్య నామస్మరణ జరుగుతుంది. నామజపం ముగిసిన తర్వాత భక్తులందరూ అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య బాబావారి పల్లకి ఉత్సవం వైభవంగా జరిపిస్తారు.
Click a year above to see how it was celebrated that year.ఆ సంవత్సరం ఎలా జరుపుకున్నారో చూడటానికి పైన ఒక సంవత్సరాన్ని క్లిక్ చేయండి.